జిల్లా పరిషత్‌ పాఠశాలలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ

సంగారెడ్డి జిల్లా‌ కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న బోజనాన్ని పరిశీలించిన మంత్రి. పదోతరగతి విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. ఆయా సబ్జెక్టులలో విద్యార్థులకు ప్రశ్నలు వేశారు. తెలుగులో సరిగా పేర్లు కూడా రాయలేకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు ఇలా ఉంటే ఎలా పాసవుతారని టీచర్లను ప్రశ్నించారు.


విద్యార్థులు ఎక్కాలు‌ చెప్పలేకపోవడంతో ఈ‌చదువులతో ప్రపంచంతో ఎలా పోటీపడతారని ప్రశ్నించారు. టీవీలు, సెల్ ఫోన్లు పక్కన పెట్టాలని, పదో తరగతి ఫలితాలలో కంది పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు. పాఠశాల సమస్యలపై నివేదిక రూపొందించి తనకు అందజేయాలని ప్రధానోపాధ్యాయుడికి ఆదేశించారు.