ప్రముఖ టూవీలర్ తయారీదారు టీవీఎస్.. ఐక్యూబ్ పేరిట ఓ నూతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. టీవీఎస్‌కు చెందిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. కాగా ఇందులో 4.4 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ స్కూటర్ గంటకు గరిష్టంగా 78 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. కేవలం 4.2 సెకన్ల వ్యవధిలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ స్కూటర్ అందుకోగలదు. ఈ స్కూటర్‌లో ఉన్న బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 75 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు.
టీవీఎస్ నుంచి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్..